VIDEO: యాదగిరిగుట్ట అయ్యప్ప దేవాలయంలో సంప్రోక్షణ, పడిపూజ
BHNG: యాదగిరిగుట్టలోని అయ్యప్ప దేవాలయంలో బుధవారం సంప్రోక్షణ చెసి పడిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి, కుమారస్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్పస్వామికి పంచామృతాభిషేకాలు చేసి, శరణు ఘోషతో పడిని వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.