VIDEO: నకిలీ పత్తి విత్తనాలతో వెళ్తున్న వాహనం పట్టివేత
MDCL: నకిలీ పత్తి విత్తనాలతో వెళ్తున్న బోలేరో వాహనం పట్టుబడిన ఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో కర్నూలు నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర తరలిస్తున్న క్రమంలో బొలెరో వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. 3000 కేజీల నకిలీ విత్తనాలతో సహా ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.