రహదారిపై కోతుల గుంపు.. భయాందోళనలో ప్రజలు

రహదారిపై కోతుల గుంపు.. భయాందోళనలో ప్రజలు

BHPL: కాటారం మండల కేంద్రానికి సమీపంలో మంథని రహదారిపై సుమారు 200 కోతులను వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం ఉదయం మార్నింగ్ వాకర్ అటువైపు వెళ్లగా, కోతుల గుంపును చూసి బెదిరిపోయారు. రోడ్డుపై ఇంత పెద్దస్కేల్‌లో కోతులను ఎప్పుడూ చూడలేదని, రాత్రి వేళలో ఎవరో విడిచి వెళ్లారని స్థానికులు ఆరోపిస్తున్నారు.