మూడేళ్లుగా సహజీవనం చేసి.. రూ. కోటితో పరార్
HYD: ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ వివాహితను ముసారాంబాగ్‌కు చెందిన సూరజ్ శర్మ కోటి రూపాయలకు మోసం చేశాడు. ప్రేమిస్తున్నానని చెప్పి జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ మహిళతో మూడేళ్లుగా సహజీవనం చేశాడు. వ్యాపారంలో అత్యవసరంగా డబ్బు అవసర పడిందని నమ్మబలికి రూ. కోటి సొత్తుతో ఉడాయించాడు. మహిళ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు అతడిని ఇవాళ అరెస్ట్ చేశారు.