'భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగానే భావిస్తున్నాం'
KKD: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్‌పై జరిగిన దాడిని భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగానే భావిస్తున్నామని కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. దాడిని నిరసిస్తూ మంగళవారం బార్ అసోసియేషన్ న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిందితున్ని కఠినంగా శిక్షించాలన్నారు.