ఓర్వకల్లులో స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

ఓర్వకల్లులో స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

నంద్యాల: జిల్లా ఓర్వకల్లులోని జైరాజ్ స్టీల్ ప్లాంట్‌లో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీ పేలుడు శబ్దంతో మంటలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో నల్లటి పొగ వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.