'ఏకలవ్య మోడల్ స్కూల్ పనులు త్వరలో పూర్తి'
PPM: అనసభద్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్ భవనం పనులు పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు TW ఈఈ మణిరాజు తెలిపారు. ఈనెల 6వ తేదీన ఒక దిన పత్రికలో వెలువడిన 'బాలికలు అక్కడ.. బాలురు ఇక్కడ' అనే శీర్షికకు ఆయన గురువారం స్పందించారు. అనసభద్రలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్ నిర్మాణం కొరకు రూ.12 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు.