కార్యకర్త కుటుంబానికి రూ. 5 లక్షల భీమా అందజేత
గుంటూరు: పెదకాకాని మండలం ఉప్పలపాడుకు చెందిన పున్నారావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆ కుటుంబానికి టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి వచ్చిన రూ.5 లక్షల భీమాను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆదివారం అందజేశారు. లబ్ధిదారులు నగదును సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు.