పార్టనర్ షిప్ సమ్మిట్ ఏర్పాట్ల ప‌రిశీల‌న‌

పార్టనర్ షిప్ సమ్మిట్ ఏర్పాట్ల ప‌రిశీల‌న‌

VSP: నవంబర్ 14, 15 తేదీలలో ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే పార్టనర్ షిప్ సమ్మిట్ ఏర్పాట్లను బుధవారం విశాఖ‌ క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తీసుకోవలసిన చర్యలు, చేపట్ట వలసిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.