అప్పన్న సన్నిధిలో ఇండోర్ మేయర్ బృందం
VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి దేవస్థానంను ఇండోర్ మేయర్ బృందం శుక్రవారం దర్శించుకుంది. నగరంలో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను పరిశీలించేందుకు వచ్చిన మేయర్ బృందం దేవాలయాన్ని సందర్శించింది. దేవాలయ దర్శనం మంచి అనుభూతిని కలిగించిందని మేయర్ తెలిపారు. అనంతరం ఈవో కె. వెంకటరావు బృందానికి తీర్థప్రసాదాలు అందజేశారు.