ఆర్టీసీ బస్సు రాక.. ప్రజల బాధ తీరక.!

ఆర్టీసీ బస్సు రాక.. ప్రజల బాధ తీరక.!

MHBD: బస్సు సర్వీసును పునరుద్ధరించాలని నెల్లికుదురు మండలంలోని మేచరాజుపల్లి గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. మహబూబాబాద్ నుంచి మేచరాజుపల్లి మీదుగా వరంగల్‌కు గత 30 సంవత్సరాలుగా ఆర్టీసీ బస్సు సేవలు అందుతున్నాయని, గత కొద్దిరోజులుగా బస్సు సర్వీసును నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.