హర్షిత్ రాణా.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు

హర్షిత్ రాణా.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో హర్షిత్ రాణా టీమిండియాకు శుభారంభాన్ని అందించాడు. వైడ్‌తో ఇన్నింగ్స్ రెండో ఓవర్‌ను ప్రారంభించిన రాణా, తర్వాతి బంతికే రికెల్టన్‌(0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అదే ఓవర్ మూడో బంతికి డికాక్‌(0)ను కూడా ఔట్ చేసి సౌతాఫ్రికాకు భారీ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 7 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.