గోకవరంలో రికార్డు వర్షపాతం

గోకవరంలో రికార్డు వర్షపాతం

E.G: గోకవరం మండలంలో గురువారం జిల్లాలోనే అత్యధిక వర్షపాతం 51.8 మిల్లీమీటర్లు నమోదు అయినట్లు ASO గంగాభవాని తెలిపారు. తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటల కురిసిన భారీ వర్షం కారణంగా వర్షపాతం నమోదైందన్నారు. సాధారణంగా అక్టోబరు నెల సగటు వర్షపాతం 159.8 మిల్లీమీటర్లు ఉండాల్సి ఉండగా ఈ నెల 30 నాటికి ఏకంగా 269.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు ASO వివరించారు.