624తుపాకులు స్వాధీనం

624తుపాకులు స్వాధీనం

చిత్తూరు: ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో లైసెన్స్ కలిగిన 697తుపాకుల్లో.. స్థానిక పోలీసు స్టేషన్ల ద్వారా 624 డిపాజిట్ చేయించారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ శనివారం తెలిపారు. మిగిలిన 73తుపాకులకు సంబంధించి బ్యాంకుల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డులు, ఏటీఎం కేంద్రాలకు డబ్బులు తీసుకెళ్లే సెక్యూరిటీ ఏజెన్సీ వారికి మినహాయింపు ఇచ్చామన్నారు.