VIDEO: నగరంలో కోతుల బెడద.. ఆందోళనలో ప్రజలు
MLG: జిల్లా కేంద్రంలో కోతుల బెడదతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వానరాలు గుంపులుగా ఇండ్లలోకి దూరి వస్తువులు ధ్వంసం చేస్తూ, సామగ్రి ఎత్తుకెళ్తున్నాయి. పండ్ల షాపులు, వ్యాపార సముదాయాల్లో వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నాయి. ప్రజలను గాయాలు చేస్తూ అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. మున్సిపల్ అధికారులు తక్షణం స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.