ఈనెల 10న మఖ్తల్‌కు సీఎం రేవంత్ రెడ్డి రాక

NRPT: మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 10వ తేది శుక్రవారం సాయంత్రం 3 గంటలకు మఖ్తల్‌కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు రవికుమార్ తెలిపారు. మఖ్తల్ పట్టణ కేంద్రంలో జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి సభకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.