నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించండి: ఎమ్మెల్సీ

నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించండి: ఎమ్మెల్సీ

BHNG: ఆలేరు మండలం కొలనుపాకలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్వే నంబర్ 8లో నివసిస్తున్న సుమారు 70 మంది నిరుపేదలకు నివేశ స్థలాలు, తాగునీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించాలని కోరారు. సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.