ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

నల్గొండ మండలం చందనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం గ్రామంలోని మిషన్ భగీరథ ట్రీట్మెంట్ ప్లాంటు సమీపంలో నకిరేకల్ నుంచి నల్గొండకు వస్తున్న బైక్‌ను ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాను ఢీకొట్టింది. ఈప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.