పదో తరగతి పరీక్ష కేంద్రంలోకి దూరిన పాము
కడప: బి.కోడూరులోని పదో తరగతి పరీక్ష కేంద్రంలోకి పాము రావడం కలకలం రేపింది. పరీక్ష కేంద్రంలో ఉన్న విద్యార్థులు పామును చూసి ఒక్కసారిగా పరుగులు పెట్టారు. వెంటనే అక్కడి సిబ్బంది పామును చంపి బయటపడేయడంలో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా ఈరోజు నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే.