పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్
E.G: జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్సై రఘునందన రావు తన సిబ్బందితో పేకాట శిబిరంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.10,050 వేల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎక్కడైనా కోడిపందాలు జూధాలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.