'ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి'

'ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి'

హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు, మల్కం చెరువులను మంగళవారం రాత్రి సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథుల నిమజ్జనం, ట్రాఫిక్ విషయాలను అడిగి తెలుసుకున్నారు. గణనాథుల ఊరేగింపు సందర్భంగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.