అన్నపై కత్తితో దాడి.. తమ్ముడికి 2 ఏళ్ల జైలు

KMR:అన్నపై కత్తితో దాడి చేసిన తమ్ముడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ బిచ్కుంద కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. పాపబోయ్ 2015లో తన అన్న కుంటి రాములుపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనపై బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సాక్ష్యాధారాల ఆధారంగా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వినీల్ కుమార్ తీర్పు వెలువరించారు.