పహల్గామ్ బాధితులకు ఆరిలోవ పాత్రికేయుల నివాళి

Vsp: పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన పర్యాటకులకు విశాఖలోని ఆరిలోవ వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నివాళులర్పించింది. శనివారం ఉదయం సంఘీభావ ర్యాలీ నిర్వహించి, ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరుడు చంద్రమౌళికి నివాళులు అర్పించి, మానవహారం ద్వారా సంతాపం తెలిపారు. పాత్రికేయులు, స్థానికులు, యువత పాల్గొన్నారు.