పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుల ప్రమాణస్వీకారం
KNR: చొప్పదండి పట్టణంలో పద్మశాలి సంక్షేమ సంఘం, యువజన సంఘం నూతన అధ్యక్షులు పచ్చునూరి తిరుపతి, అనుమల్ల సత్యం ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన కార్యదర్శిగా వల్లాల జగన్, కోశాధికారిగా దండె సత్యానందం, యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా గుండేటి వెంకటరమణ, కోశాధికారిగా పొరండ్ల నితీష్‌తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు కూడా ప్రమాణం చేశారు.