తుళ్లూరులో రెండు డెంగీ కేసులు నమోదు

GNTR: తుళ్లూరు మండల పరిధిలోని అనంతవరం, వడ్డమాను గ్రామాల్లో డెంగీ జ్వరాల వ్యాప్తిపై వైద్య ఎకడమిక్ బృందం శనివారం పరిశీలన చేపట్టింది. ఇంటింటికీ తిరిగి జ్వరాల సర్వే చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తున్న అనంతవరానికి చెందిన మహిళ, వడ్డమానులో 11 ఏళ్ల బాలుడు డెంగీ బారిన పడడంతో వైద్యులు రంగంలోకి దిగారు. వైద్య పరీక్షలు నిర్వహించారు.