మరో గంట మాత్రమే ఉంది.. వినియోగించుకోండి
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ చివరి దశకు చేరుకుంది. మరో గంటలో పోలింగ్ ముగియనుంది. ఇప్పటికీ పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు తమ ఓట్లను వినియోగించుకుంటున్నారు. అయితే సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుండగా, క్యూలో ఉన్న వారికి ఓట్ వేసే అవకాశం కల్పించనున్నారు. ఓటు వెయ్యనివారు ఉంటే ఇంకా గంటే సమయం ఉంది.. లేవండీ.. లేచి ఓటు అనే మీ ఆయుధాన్ని ఉపయోగించుకోండి.