వర్ధన్నపేటలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

వర్ధన్నపేటలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

WGL: వర్ధన్నపేట పట్టణలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఆదివారం సైబర్ నేరాల అవగాహన కార్యక్రమంలో ఎస్సై రాజు పాల్గొన్నారు. ప్రజలు అవగాహన పెంచుకుంటే సైబర్ నేరాలకు చెక్ పెట్టవచ్చని ఆయన తెలిపారు. ఆన్‌లైన్ మోసాలు, నకిలీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా డబ్బులు దండుకుంటున్నారని హెచ్చరించారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే జాతీయ హెల్ప్‌లైన్ టోల్ నెంబర్ 1930ను సూచించారు.