యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఎమ్మార్వోకు వినతి

ADB: జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ నేషనల్ హ్యూమన్ రైట్ కమిటీ వైస్ చైర్మన్ రాథోడ్ సందీప్ నేరడిగొండ తహసీల్దార్ సయ్యద్ అబ్దుల్ కలీంను కలిసి బుధవారం వినతి పత్రం అందజేశారు. యూనివర్సిటీ లేకపోవడంతో విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు. ఉన్నత చదువులకు సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు.