'పాంచ్ మినార్'పై హైప్ పెంచేస్తున్న హీరో
రాజ్ తరుణ్, రాశి సింగ్ జంటగా నటించిన సినిమా 'పాంచ్ మినార్'. రామ్ కడుముల దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మేము అనుకున్న దానికంటే మంచిగా వచ్చింది. ప్రతి సీన్‌లో ఫన్ ఉంటుంది. నా గత కొన్ని సినిమాలు అంతగా రీచ్ కాలేదు. ఈ మూవీ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది' అని పేర్కొన్నాడు.