గ్రామపంచాయతీ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షుడు మృతి

SRPT: మోతే మండలం రాయి పహాడ్ గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షుడు పొడపంగి లక్ష్మీనారాయణ శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన పార్థివదేహానికి ఎంపీడీవో ఆంజనేయులు పూలు వేసి నివాళులు అర్పించి తక్షణ ఆర్థిక సాయం కింద కుటుంబ సభ్యులకు 10 వేల రూపాయలు అందించారు.