'అవార్డులకు దరఖాస్తు చేసుకోండి'

అన్నమయ్య: క్రీడా ప్రతిభ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈనెల 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఏటా ఇచ్చే క్రీడా ప్రతిభా అవార్డులు 2025కు గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్మణ్యం అన్నారు. జిల్లాలోని పాఠశాలలు ఈనెల 18 లోపు దరఖాస్తులను డీఈవో కార్యాలయంలో అందజేయాలని ఆయన కోరారు.