క్రీడల్లో సైతం రాణించాలి: ఎమ్మెల్యే

క్రీడల్లో సైతం రాణించాలి: ఎమ్మెల్యే

ప్రకాశం: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ అన్నారు. ఒంగోలులోని సంతపేటలో ఉన్న పేస్ స్కూల్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ పట్టణ స్థాయిక్రీడా సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడల ద్వారా మానసిక ఏకాగ్రత పెరుగుతుందని, ఇది విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.