వేతనాలు చెల్లించాలని ఆశా కార్యకర్తలు ధర్నా
BHNG: గత రెండు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు మంగళవారం భూదాన్ పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆశా కార్యకర్తల సమావేశానికి హాజరు కాకుండా బహిష్కరించారు. గత ప్రభుత్వ హయాంలో 5వ తేదీ లోపు వేతనాలు చెల్లించే వారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు.