'చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి'

BPT: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రేపల్లె టీడీపీ కార్యాలయంలో రెవిన్యూ శాఖ మంత్రి సోదరులు అనగాని శివప్రసాద్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతికి చేనేత రంగం ప్రతీక అని, వ్యవసాయం తర్వాత వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని తెలిపారు. చేనేత కార్మికులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.