జిల్లాలో గుప్త నిధుల కలకలం

జిల్లాలో గుప్త నిధుల కలకలం

MLG: గుప్త నిధుల ఘటన కలకలం రేపింది. మంగపేట మండలానికి చెందిన కొందరు వ్యక్తులు ఇటీవల మహారాష్ట్రలోని ఓ గ్రామానికి వెళ్లి ఓ ఇంట్లో తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో భారీగా బంగారం లభించిందని, దాని విలువ రూ.కోట్లలో ఉంటుందని సమాచారం. అందులో వెళ్లిన కొంతమందికి వాటా ఇవ్వకపోవడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీనిపై SP శబరీష్ విచారణ చపట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.