VIDEO: గాయపడిన వారిని పరామర్శించిన సీపీఐ నేత
GNTR: దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు పొలం పనులకు ఆటోలో వెళ్తుండగా, ఆటో బోల్తా పడి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి జీజీహెచ్‌కు తరలించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, తిరుపతయ్య, వెంకటేశ్వర్ రెడ్డి పరామర్శించారు.