నందిగామలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు
NTR: నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నండ్రు బాబు విద్యాసాగర్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. నందిగామ, గుంటూరుకు చెందిన కోండ్రు సందీప్, కామిశెట్టి చెన్నకేశవులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. న్యాయవాదులకు రక్షణ చట్టం లేకపోవటం వల్ల తరచూ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.