వాడపల్లి వెంకన్న సేవలో వ్యవసాయ శాఖ మంత్రి సతీమణి
కోనసీమ: అత్రేయపురం మండలం పరిధిలోని వాడపల్లిలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సతీమణి విజయ మాధవి మంగళవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమెకు అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.