వీరబ్రహ్మేంద్రస్వామి వారికి అభిషేకం

ప్రకాశం: కనిగిరిలోని స్థానిక దరువు వద్ద ఉన్న మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో బుధవారం ఘనంగా స్వామివారి ఆరాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు స్వామివారికి అభిషేకం చేసేందుకు దరువు వద్ద నుండి కలశాలతో నీళ్లు తీసుకొని వచ్చి స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు విశ్వరూప చారి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.