RDO ఆఫీస్ ఎదుట బాధిత రైతుల ధర్నా
SRD: జహీరాబాద్ పట్టణంలోని RDO, నిమ్జ్ కార్యాలయం ఎదుట ఇవాళ రైతులు ధర్నాకు దిగారు. ఝరాసంగం, న్యాల్కల్ మండలంలోని నిమ్జ్ బాధిత రైతులకు, కూలీలకు పరిహారం చెల్లించకుండా అక్కడ ఎలాంటి పనులు చేపట్టరాదని ఆందోళనకు దిగారు. బాధిత రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని కార్మిక సంఘాలు రైతులకు అండగా నిలబడి ధర్నాలో పాల్గొన్నారు. వెంటనే అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు.