VIDEO: పిచ్చికుక్క బీభత్సం.. ఇద్దరిపై దాడి

VIDEO: పిచ్చికుక్క బీభత్సం.. ఇద్దరిపై దాడి

KMM: కూసుమంచి మండలం జీళ్లచెరువు గ్రామంలో ఆదివారం ఓ పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. ఉదయం ఓ బాలుడిపై దాడి చేసిన కుక్క, సాయంత్రం పంచాయతీ కార్యాలయ కార్మికుడు గోపి నాగయ్యపై కూడా దాడి చేసి కరిచింది. అంతేకాకుండా, మేకలు, బర్రెలను కూడా కరవడంతో గ్రామం మొత్తం భయభ్రాంతులకు గురైంది. దీంతో ఆందోళన చెందిన గ్రామస్థులు కర్రలు పట్టుకుని ఆ పిచ్చికుక్కను చంపేశారు.