గోవాడ శారదా నదిలో పడి పశువుల కాపరి మృతి

AKP: చోడవరం మండలం అంబేరిపురం గ్రామానికి చెందిననందిపోళ్ళ దేవుడు(60) గోవాడ శారదా నదిలో పడి మృతి చెందాడు. ఇతను పశువులు కాస్తూ శారదా నదిలో పశువులను కడిగేందుకు దిగాడు. దీంతో ఆ ప్రాంతంలో ఊబి ఉండడం వల్ల చనిపోయి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. ఫైర్ సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. అంబేరుపురం గ్రామంలో విషాదఛాయలు అమలుకున్నాయి.