మేదరమెట్లలో రోడ్డు ప్రమాదం.. కారు, బస్సు ఢీ
BPT: కొరిసపాడు మండలంలోని మేదరమెట్ల సమీపంలో ఇవాళ కారు, బస్సు ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఎదురెదురుగా కారు, బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరుని పరిశీలించారు. ఎవరికీ ఏం కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.