'మార్కెట్ కమిటీ కార్యాలయానికి స్థలం కేటాయించాలి'

VZM: అద్దె భవనంలో ఉంటున్న కొత్తవలస వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చొక్కాకుల మల్లునాయుడు గురువారం తహసీల్దార్ అప్పలరాజును కలసి వినతి పత్రం అందజేశారు. జడ్పీ పాఠశాల ఎదురుగా ఖాళీగా ఉన్న వ్యవసాయ కార్యాలయ పాత భవనాన్ని తమకు కేటాయించాలని వినతి పత్రంలో కోరారు. ఇందులో కార్యదర్శి విజయబాబు పాల్గొన్నారు.