అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం

అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం

VSP: విశాఖలోని పీఎంపాలెం ఆఖరి బస్ స్టాప్ సమీపంలో గల అటవీ ప్రాంతంలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. శిరిడీ పద్మ సాయి ఆలయానికి చేరువలో మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి, సుమారు గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది.