మోసం చేశాడని మహిళ ఆత్మహత్యాయత్నం
అన్నమయ్య: ములకలచెరువు మండలం పెద్దపాళ్యానికి చెందిన అమ్మజాన్ కువైట్‌లో పని చేసి సంపాదించిన డబ్బు, బంగారం స్థానిక వ్యక్తికి పంపింది. భారత్‌కు వచ్చిన తర్వాత వాటిని ఇవ్వాలని అడగగా అతను నిరాకరించాడని పోలీసులు తెలిపారు. దీంతో మోసపోయాననే భావనతో ఆమె వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు.