ఎండ దెబ్బకు ఒకరి మృతి
GNTR: పత్తిపాడు పంచయతీ పరిధిలోని తూర్పుపాలెంలో ఎండ దెబ్బకు గురై మున్నంగ రమేష్(35) మృతి చెందినట్లు మృతుడి భార్య మేరీ చెప్పారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. పత్తిపాడులో ఓ దుకాణంలో పని చేసి బుధవారం మధ్యాహ్నం సుమారు 2గంటలకు సమయలో ఇంటికి వచ్చి నీళ్లు తాగుతూ ఆకస్మికంగా మంచంపై పడి చనిపోయినట్లు ఆమె తెలిపారు.