బైక్‌కి నిప్పెట్టిన దుండగులు.. పూర్తిగా దగ్ధం
VKB: మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో నివాసం ఉండే కృష్ణారెడ్డి అనే వ్యక్తి బైక్‌ను ఆదివారం రాత్రి దుండగులు నిప్పెట్టి దహనం చేశారు. సోమవారం ఉదయం లేచి చూసేటప్పటికి బైక్ మొత్తం పూర్తిగా దగ్ధమైంది. దీంతో బాధితుడు వికారాబాద్ PSలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.