శబరిమలలో తగ్గిన భక్తుల రద్దీ

శబరిమలలో తగ్గిన భక్తుల రద్దీ

మొన్నటి వరకు జనసందోహంతో కిటకిటలాడిన శబరిమల అయ్యప్ప క్షేత్రం ఖాళీగా దర్శనమిస్తుంది. వర్చువల్‌ క్యూ ద్వారా బుక్‌ చేసుకున్న వారిలో దాదాపు 15% మంది భక్తులు రాకపోవడంతో రెండు రోజులుగా.. అయ్యప్ప దర్శనానికి రద్దీ తగ్గింది. స్పాట్‌ బుకింగ్‌ పరిమితిని పెంచుకోవచ్చని కేరళ హైకోర్టు చెప్పినా.. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి సన్నిధానంలో రద్దీ తక్కువగా ఉండటం గమనార్హం.