మళ్లీ 'అమృతం' సీరియల్ వచ్చేస్తోంది
90's కిడ్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్న 'అమృతం' సీరియల్ మరోసారి రాబోతుంది. యూట్యూబ్ వేదికగా 'అమృతం సీరియల్' ఛానల్‌తో ఇది అందుబాటులోకి రానుంది. ఈ నెల 24 నుంచి ప్రతి రోజూ రెండు ఎపిసోడ్స్‌ను విడుదల చేయనున్నట్లు టీం ప్రకటించింది. ఈ మేరకు దీని ట్రైలర్‌ను విడుదల చేసింది. దీంతో ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.